నేటి నుంచి ముషీరాబాద్ ఆసుపత్రిలో ఆరోగ్య దీపిక
ప్రతి రోజు వివిధ రోగాలకు ప్రత్యేక పరీక్షలు
ముషీరాబాద్,ఆగస్టు 19 (విజయక్రాంతి): ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఆరోగ్య దీపిక పేరుతో పాలీ క్లినిక్ను ఏర్పాటు చేశారు. గురువారం నుంచి యూపీహెచ్సీలో వివిద రకాల రోగాలకు ప్రతి రోజు స్పెషలిస్టుచే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
రోజుకో స్పెషలిస్టుచేత వైద్య పరీక్షలు
ఆరోగ్యదిపిక పేరుతో ఏర్పాటు చేసిన పాలీక్లీనిక్ ప్రతి రోజు రోజుకోక రోగానికి స్పెషలిస్టుల చే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం పుల్మోనాలజిస్ట్, మంగళవారం జనరల్ ఫిజీషియన్, ఈఎన్టీ, బుధవారం జనరల్ సర్జరీ, గురువారం గైనకాలజీ, ఆర్థోపెడిక్, శుక్రవారం పెడియా ట్రిక్, శనివారం ఆర్థోపెడిక్, బుధవారం అప్తాలజీ తదితర వ్యాధులకు సోమవారం నుంచి శనివారం వరకు ఆరోగ్య దీపిక పాలీ క్లీనిక్ వైద్య సేవలు అందించనున్నారు. తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులను గుర్తించేందుకు ఈ క్లీనిక్ ఎంతో దోహదపడుతుం దని వైద్యులు అంటున్నారు. ప్రాథమిక దిశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స అందించేందుకు ఎంతో దోహపడుతాయిని పేర్కొంటున్నారు.
ఆరోగ్య దీపికలో ప్రత్యే వైద్య సేవలు: డాక్టర్ మనోజ్ రెడ్డి
యూపీహెచ్సీ వైద్యాధికారి ఆరోగ్య దీపిక పేరిట ఏర్పాటు చేసిన పాలీ క్లినిక్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నాం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రముఖ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించనున్నాం. పాలీ క్లీనిక్ ల ద్వారా ముందే వ్యాధిని నిర్ధారించి చికిత్స అందించేందుకు దోహదపడుతాయి. ప్రజలు ఆరోగ్య దీపికలను సద్వినియోగం చేసుకోవాలి.






