20-09-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 19: రాష్ట్ర స్థాయి టిఎల్‌ఎం మేళాకు ఉపాధ్యాయురాలు దీపిక ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండల కేంద్రం వెంకటరమణ కాలనీకి చెందిన పాఠశాల ఉపాధ్యాయుని దీపిక తుక్కుగూడలోని దేవేంద్ర పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి టిఎల్‌ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్)మేళాలో ఇంగ్లీషులో మొదటి స్థానాని కైవసం చేసుకొని, రాష్ట్రస్థాయి టిఎల్‌ఎం మేళాకి ఎంపిక కావడం జరిగింది.
ఈ మేరకు డిఈవో సుశీందర్ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా మండలానికి చెందిన విద్యాధికారులు, ఉపాధ్యాయులు దీపికని అభినందించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలం నుండి చర్లపటేల్ గూడ ఉపాధ్యాయురాలు వి.అనసూయ జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి రావడం జరిగింది. దింతో వారిని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందనలు తెలియజేశారు.