20-09-2025 12:00:00 AM
పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం
రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 19: క్యాథనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణా పూర్ భూ కబ్జాలకు నెలవుగా మారుతుంది. పట్టణంలోని సింగరేణి భూముల సంగతి పక్కన పెడితే ప్రభుత్వ స్థలాలను భూ బకాసురులు యథేచ్ఛగా కబ్జా చేయగా అడిగే నాథుడే కరువయ్యారు. దీనితో పట్టణంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవు తున్నాయి.
రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క సెంటు భూమిని కూడా కబ్జా కానివ్వమని, ఎవరైనా కబ్జాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామనే మాటలకే పరిమితం అవుతు న్నారు. పట్టణంలోని ఓ మూసివేసిన కాలేజీని ఆనుకోని ఉన్న (సర్వే నంబర్ 7) ప్రభు త్వ స్థలాన్ని ‘ హస్త’గతం చేసుకునేందుకు గత కొంత కాలంగా అక్రమార్కులు చదును చేయడం, కంచె ఏర్పాటు చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో తూతూమంత్రంగా రెవెన్యూ అధికారులు ఆ స్థలన్ని ప్రభుత్వ భూమి అని కబ్జాదారులను హెచ్చరించి వెళ్లిపోయారు. అసలు అధికారుల మాటలంటే కబ్జాదారులకు లెక్కలేదా? లేక సంబంధిత అధికారులకు ప్రభుత్వ భూము లు అంటే పట్టింపులేదా? లేక వారి కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయా..? అని పట్టణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.