calender_icon.png 7 November, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీప్తి శర్మ, వోల్వార్ట్, హీలీలకు షాక్

07-11-2025 12:00:00 AM

  1. స్టార్ ప్లేయర్స్‌ను వదిలేసిన ఫ్రాంచైజీలు

డబ్ల్యూపీఎల్ 2026 రిటెన్షన్ జాబితా రిలీజ్

ముంబై, నవంబర్ 6 : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి ముందు పలువురు స్టార్ ప్లేయర్స్‌కు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. రిటెన్షన్ నిబంధనలకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తమ తమ జట్లలో మ్యాచ్ విన్నర్లను సైతం వదులుకున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు యూపీ వారియర్ షాకిచ్చింది. దీప్తిని వేలంలోకి రిలీజ్ చేసింది. దీప్తి శర్మ గత మూడు సీజన్ల నుంచి యూపీకే ఆడుతోంది.

ఈ ఆల్‌రౌండర్‌కు ఇప్పుడు వేలంలో భారీ ధర పలికే అవకాశముంది. ఆమెతో పాటు అలిస్సా హీలీ, ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వంటి కీ ప్లేయర్స్‌ను కూడా వదులు కుంది. యూపీ వారియర్జ్ కేవలం శ్వేతా సెహ్రావత్(రూ. 50 లక్షలు)ను మాత్రమే రిటైన్ చేసుకుంది. అలాగే మిగిలిన ఫ్రాంచైజీలు సైతం పలువురు ప్లేయర్స్‌ను రిలీజ్ చేశాయి.

డబ్ల్యూపీఎల్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం తాము రిటైన్ చేసుకున్న తొలి ప్లేయర్‌కు రూ.3.5 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ.2.5 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ.1.75 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు 1 కోటి, ఐదో ప్లే యర్‌కు రూ.50 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ హర్మన్ ప్రీత్‌కౌర్, నాట్ సీవర్ బ్రం ట్‌తో పాటు ఐదుగురిని రిటైన్ చేసుకోగా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన, రిఛా ఘోష్, ఎల్లీస్ పెర్రి, శ్రేయాం క పాటిల్‌ను తమ వద్దే ఉంచుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, అన్నాబెల్ సదర్లాండ్ వంటి ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకుంది. కాగా మహిళల ఐపీఎల్ వేలం నవంబర్ 27న ఢిల్లీలో జరుగుతుంది.

ముంబై ఇండియన్స్ : నాట్ సీవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్(రూ.2.5 కోట్లు), హీలీ మాథ్యూస్(రూ.1.75 కోట్లు), అమన్‌జోత్ కౌర్(రూ. 1 కోటి), జి.కమిలినీ(రూ.50 లక్షలు)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన(రూ.3.5 కోట్లు), రిఛా ఘోష్ (రూ.2.75 కోట్లు), ఎల్లిస్ పెర్రీ (రూ.2 కోట్లు), శ్రేయాంక పాటిల్ (రూ.60 లక్షలు)

గుజరాత్ జెయింట్స్ : ఆష్లీ గార్డ్‌నర్(రూ.3.5 కోట్లు), బెత్ మూనీ( రూ.2.5 కోట్లు)

యూపీ వారియర్జ్ : శ్వేతా సెహ్రావత్( రూ.50 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్ : జెమీమా రోడ్రిగ్స్ (రూ.2.2 కోట్లు), షెఫాలీ వర్మ(రూ.2.2 కోట్లు), అన్నాబెల్ సదర్లాండ్( రూ.2.2 కోట్లు), మారిజాన్ కాప్(రూ.2.2 కోట్లు), నికి ప్రసాద్(రూ.50 లక్షలు)