calender_icon.png 7 November, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహ్మదాబాద్‌లో ఫైనల్

07-11-2025 12:00:00 AM

  1. టీ20 వరల్డ్‌కప్ వేదికలు ఖరారు

తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్

ముంబై, నవంబర్ 6 : మరో మెగా టోర్నీ ఆతిథ్యానికి భారత్ సన్నద్ధమవుతోం ది. వచ్చే ఏడాది శ్రీలంకతో కలిసి సంయుక్తంగా టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమి స్తున్న నేపథ్యంలో వేదికలు ఖరారయ్యాయి. ఈ వరల్డ్‌కప్ ఫైనల్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. టైటిల్ పోరు ఈ వేదికపై ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్‌కు చేరిన మాత్రం కొలంబో ఆతిథ్యమిస్తుంది.

ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. ఐసీసీ భారత్‌లో ఐదు, శ్రీలంకలో రెండు వేదికలను ఎంపిక చేసింది. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై నగ రాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అటు శ్రీలంకలో కొలంబో, క్యాండీ వేదికలుగా నిర్వహించనున్నారు. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నింటికీ శ్రీలంక ఆతిథ్యమిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీ ఫైనల్‌కు అహ్మదాబాద్‌ను ఎంపిక చేశారు.గతంలో ఇక్కడ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. మరోవైపు ప్రపంచకప్ ఆతిథ్య నగరాల్లో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు.

హైదరాబాద్, విశాఖ లకు ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఇక బెంగళూరు లో తొక్కిసలాట ఘటన కారణంగా ఆ వేదికను కూడా ఐసీసీ పక్కన పెట్టేసింది. ఇప్ప టికే టీ20 ప్రపంచకప్‌కు 20 జట్లూ అర్హత సాధించాయి. ఒక్కో గ్రూపులో 5 జట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు.