16 July, 2026 | 1:26 AM

పోలీసుల భయంతో భవనంపై నుంచి దూకి యువకుడి మృతి

07-06-2024 02:31 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి): పేకాట ఆడుతుం డగా పోలీసులు రావడంతో మూడం తస్తుల భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన హైదరా బాద్‌లోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లాలాపేటలో వినయ్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడి నుంచి తప్పించుకునే  క్రమంలో వినయ్ (౩౫) వ్యక్తి మూడం తస్తుల భవనంపై నుంచి దూకాడు. తీవ్రగాయాలైన వినయ్ చికిత్సపొం దుతూ మృతిచెందాడు. అయితే పోలీ సులు కొట్టిన దెబ్బలతోనే వినయ్ చనిపోయాడని వినయ్ కుటుంబస భ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.