11-02-2026 01:02:59 AM
దిస్పూర్, ఫిబ్రవరి 10: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, ఆయన కుటుంబ సభ్యు లు 1,200 ఎకరాల భూములు ఆక్రమించారని కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగోయ్ ఇటీవల ఆరోపించారు. ఆ ఆరోపణలపై సీఎం సీరియస్‌గా స్పందించారు. మంగళవారం ఈ మేరకు ఆ ముగ్గురిపై రూ.500 కోట్లకు పరువునష్టం దావా వేశారు. తన పరువూ ప్రతిష్ఠలకు భం గం కలిగించేలా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారని మీడియాకు తెలిపారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తాజా పరిణామాలు అక్కడి రాజకీయాలను వేడెక్కించింది.