24 March, 2026 | 8:29 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

తమిళ్ తలైవాస్ ఓటమి

18-11-2024 12:44 AM

పీకేఎల్ 11వ సీజన్

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్ 11వ సీజన్)లో తమిళ్ తలైవాస్‌కు ఓటమి ఎదురైంది. నోయిడా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ జట్టు 29-36 తేడాతో హర్యానా స్టీలర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. హర్యానా స్టార్ ఆల్‌రౌండర్ షాదులు హైఫై సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో కూడా తమిళ జట్టు స్టార్ రైడర్ సచిన్ తన్వర్ బరిలోకి దిగలేదు. ఈ విజయంతో హర్యానా తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన హర్యానా అందులో 8 మ్యాచ్‌లు గెలిచింది. హర్యానాలో వినయ్ సూపర్-10 సాధించాడు. తమిళ జట్టు స్టార్ రెయిడర్, కెప్టెన్ కండోలా 4 పాయింట్లతో నిరాశపరిచాడు.

మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కొనసాగుతోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో జైపూర్ 30 తేడాతో పునేరి పల్టన్‌పై విజయాన్ని అందుకుంది. జైపూర్‌లో స్టార్ డిఫెండర్ అంకుష్ హైఫై సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్జున్ దేశ్వాల్ 8 రెయిడ్ పాయింట్లతో సత్తా చాటాడు. నేటి మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో హర్యానా, బెంగళూరు బుల్స్‌తో యు ముంబా తలపడనున్నాయి.