16 April, 2026 | 2:28 AM

పద్మాజీవాడి సింగిల్ విండోలో ఇష్టారాజ్యం

16-04-2026 12:47 AM

పదవి లేకున్నా పెద్దరికం, వారి కనుసైగల్లోనే పనులు 

సదాశివనగర్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడిలోనీ సింగిల్ విండోలో సిబ్బంది వ్యవహారిస్తున్న తిరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గం పదవి కాలం పూర్తి అయి 6 నెలలు గడుస్తున్న వారి కనుసైగాల్లోనే పనులు కొనసాగుతున్నాయి. వారు చెప్పినట్టు సిబ్బంది వ్యవహరించడం గమనర్వాహం. సింగిల్ విండో సర్వ సభ్య సమావేశంలో సైతం పాలక వర్గాన్ని పిలిచి స్టేజి పై కూర్చోబెట్టారు.

అది కాకుండా శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభంలో కూడ పాల్గొన్నారు. అధికాకుండా బుధవారం బీమా చెక్కు పంపిణి సమయంలో కూడా గత పాలక వర్గాన్ని పిలిచి వారిచే చెక్కులు అందజేశారు. దీనిపై స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ కు కనీసం సమాచారం ఇవ్వకపోవడం పై సర్వత్రా విమర్శలు వెలుబడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా సింగిల్ విండో సిబ్బంది వ్యవహరించిన తిరును సోసైటీ పరిధిలోనీ రైతులు విమర్శిస్తున్నారు.