calender_icon.png 23 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెత్తను క్లీన్ చేయకుండా కాలయాపన

22-12-2025 11:56:54 PM

ద్వారకాపురి కాలనీ, సోనియాగాంధీనగర్ కాలనీల మొర

కుషాయిగూడ, డిసెంబర్ ౨౨ (విజయక్రాంతి): కాప్రా సర్కిల్ జిహెచ్‌ఎంసి పరిధిలోని చర్లపల్లి డివిజన్ పరిధిలో సోనియాగాంధీ నగర్, ద్వారకాపురి కాలనీ మధ్య కల్వర్టు వద్ద నాలాలో పేర్కొన్న చెత్తపై స్పందించండి అంటూ మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ కు ద్వారకాపురి కాలనీ సోనియాగాంధీ నగర్ కాలనీ వాసులు మొరపెట్టుకుంటున్నారు సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన హిటాచి లేదని కుంటి సాకులు చూపుతు నాలాల్లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయకుండా కాలయాపన జరుపుతున్నారని ఆయా కాలనీలవాసులు.

మండిపడుతు న్నారు. సంవత్సరంలో ఒకేసారి కాప్రా చెరువు నుండి నాగారం చెరువు దాకా తూతూ మంత్రంగా క్లీనింగ్ చేసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేతులు దులుపుకుంటున్నారు శాశ్వత పరిష్కారం కనుగొని పరిష్కార మార్గం చూపాలని చర్లపల్లి డివిజన్ వాసులు జిహెచ్‌ఎంసి అధికారులను డిమాండ్ చేస్తున్నారు. గతంలో మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ నాలాకు శాశ్వత పరిష్కారం కోసం రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 

కానీ ఈ నాలాకు ఇంతవరకు మోక్షం లభించలేదు ఆయన పదవీకాలం. అయిపోయింది మళ్లీ మరో ఐదు సంవత్సరాలు కూడా పూర్తవుతుందని, ఇంతవరకు అటువైపు చూసిన దాఖలాలు లేవు  ఇప్పటికైనా ఇక్కడి నుండి గెలిచిన ఎవరైనా సరే ఈ నాలకు రెండు వైపులా రెండు కాలనీలా  మధ్య కల్వర్టు  ఏర్పాటు చేయాలని ప్రజలు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి మొరపెట్టుకున్నారు. కాప్రా జీహెచ్‌ఎంసి డిప్యూటీ కమిష నర్ జగన్, కాప్రా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, డిప్యూటీ ఇంజనీర్ బాలకృష్ణలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న హిటాచి లేదని, వచ్చినప్పుడే క్లీన్ చేస్తామని అధికారులు చెబు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.