ఆ వీడియో తొలగించండి
సునీతా కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, జూన్ 15: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 28న రాస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన వీడియో/ఆడియోను సోష ల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. కేజ్రీవాల్ వాదనలకు సంబంధించిన ఆడియో/వీడియోను ఆప్‌తో సహా ఇతర పార్టీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అలా కోర్టులో జరిగిన విచార ణను రికార్డు చేయడం ‘హైకోర్టు ఆఫ్ ఢిల్లీ రూల్స్ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫర్ కోర్ట్స్ (2021)’ నిబంధ నల ప్రకారం చట్ట విరుద్ధమంటూ పిటిషనర్ వాదించారు.
వీటిని వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు యత్నించారని ఆరోపించారు. ఇదం తా ఆప్, కేజ్రీవాల్ కుట్రలో భాగమని, నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో, అరవింద్ కేజ్రీవాల్ వాదనలకు సంబంధించిన ఆడియో/ వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు.. సునీతా కేజ్రీవాల్ దీనికి సంబంధించిన పోస్టులు లేదా రీపోస్టులను తీసివేయాలని సోషల్ మీడియా కంపెనీలను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది.






