ఎక్కువ చెల్లించిన పరిహారం తిరిగి ఇచ్చేయండి!
మాజీ ఉద్యోగులకు ‘ఎక్స్’ హెచ్‌ఆర్ విభాగం మెయిల్స్
న్యూఢిల్లీ, జూన్ 15: ‘మీకు అందించాల్సిన దానికంటే ఎక్కువ సొమ్ము చెల్లించాం. మీరు వీలైనంత త్వరగా మాకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేస్తే సంతోషిస్తాం’ అంటూ ‘ఎక్స్’ మానవ వనరుల విభాగం ఆస్ట్రేలియాకు చెందిన కొందరు మాజీ (ట్విట్టర్) ఉద్యోగులకు ఈనూ పంపించింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ 2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వస్తూ వస్తూనే ‘ట్విట్టర్’కు తిరిగి ‘ఎక్స్’గా నామకరణం చేశారు. 80శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. వారందరికీ పరిహారం సైతం అందించారు. వీరిలో ఆస్ట్రేలియాకు చెందిన కొందరికి ఎక్కువ మొత్తంలో చెల్లింపులు అందాయని, కరెన్సీ కన్వర్షన్, షేర్ల మదింపు అం శాల్లో తప్పిదాలు జరిగి ఎక్కువ మొ త్తంలో ఉద్యోగులకు పరిహారం అం దిందనేది ‘ఎక్స్’ ప్రతినిధుల వాదన.






