15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఢిల్లీ పేలుళ్ల కేసు నిందితులకు కస్టడీ

01-12-2025 01:49 AM

-నలుగురిని ఎన్‌ఐఏకు అప్పగించిన పాటియాలా కోర్టు

న్యూఢిల్లీ, నవంబర్ 30: ఢిల్లీ పేలుళ్ల కేసు లో నలుగురు నిందితుల కస్టడీని ఎన్‌ఐఏ కోర్టు 10 రోజుల పాటు పొడిగించింది. ఢిల్లీ పేలుళ్ల కేసులో పుల్వామా (జేకే)కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, అనంతనాగ్ (జేకే)కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, లక్నో (యూపీ)కు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్, షోపియన్ (జేకే)కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేలకు పాటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు 10 రోజుల పాటు ఎన్‌ఐ కస్టడీని పొడిగించింది.

ఈ కేసులో ఇప్పటి వరకు ఎన్‌ఐఏ ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తోంది. మరోవైపు పేలుడు కేసు కు కేంద్రమైన అల ఫలా యూనివర్సిటీలో తాజాగా అధికారులు తనిఖీలు చేశారు. కీలక నిందితురాలైన షాహీనా సయీద్ ఉన్న గదిలో సుమారు రూ.18లక్షలు లభించినట్లు సమాచారం.

ఈ నగదను మొత్తం వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ కార్యకలాపాల కోసం వాడేందుకే నిల్వచేసినట్లు తెలుస్తుంది. ఢిల్లీ పేలుళ్ల కేసును దర్యాప్తు చేయడానికి, దానిలో వారి పాత్రను నిర్ధారించడానికి నిందితులను మరింత రిమాండ్ చేయాలని ఎన్‌ఐఏ కోరింది. కొన్ని చట్టపరమైన అవసరాలకు సంబంధించి మరో ముగ్గురు నిందితులను కూడా కోర్టు ముందు హాజరుపరిచినట్లు సమాచారం. ఉగ్రనెట్‌వర్క్‌పై విచారణ నడుస్తోందని పేర్కొన్నారు.