17 June, 2026 | 11:34 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

01-12-2025 01:47 AM

-ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ

-11 మంది మృతి.. 40 మందికి గాయాలు

-మృతుల్లో 9 మంది మహిళలు

-తిరుపత్తూరు సమీపంలో ఘటన

చెన్నై, నవంబర్ 30: తమిళనాడులో ఆదివారం ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని తిరుపత్తూరు సమీపంలో ప్రభుత్వానికి చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక బస్సు కరైకుడి వైపు, మరొకటి మధురై వైపు వెళుతుండగా తిరుపత్తూరు సమీపంలోని రోడ్డుపై ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంతో 11 మంది మృతిచెందిన వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. వాహనాల్లో చిక్కుకున్నారని, వారిని స్థానికులు, అత్యవసర బృందాలు బయటకు తీశారు. క్షతగాత్రులను శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపత్తూరు ప్రాంతంలోని పిళ్ళైయార్పట్టి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఆ మార్గంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించామని చేశామని పేర్కొన్నారు.