ఢిల్లీలో ఒకేరోజులో అత్యధిక వర్షం
* వందేళ్ల తరువాత రికార్డు స్థాయిలో వాన
* 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
* ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశ రాజధాని ఢిల్లీలో ఒకేరోజులో అత్యధిక వర్షపాతం నమోదయింది. శనివారం(డిసెంబర్ 28) ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దాదాపు 101 ఏళ్ల తరువాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది.
101 ఏళ్ల క్రితం 1923 డిసెంబర్ 3వ తేదీన 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షం తరువాత మళ్లీ 2024 డిసెంబర్ 28న శనివారం అత్యధిక వర్షపాతం కురిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. నగరంలో మరిన్ని జల్లులు కురుస్తాయని ప్రకటించింది. వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోయాయి.
వర్షం వల్ల రోడ్లపై వరద నిలిచిపోడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా రాజధానిలో వాయునాణ్యత ఒక్కసారిగా మెరుగుపడింది.
ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు..
ఢిల్లీలో ఓ వర్షాలు కురుస్తున్నా మరోవైపు చలిగాలులు భయపెడుతున్నాయి. రానున్న కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కా నున్నాయి. రాబోయే రెండు రోజుల్లో కని ష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ తెలి పింది. ఈ నెల 30,31 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
పంజాబ్, హర్యానా, కశ్మీర్, రాజస్థాన్‌లలో చలిగాలులు వీస్తాయని ప్రకటించింది. భారీగా మంచు కురుస్తుండడంతో శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. విమాన, రైల్వే ప్రయాణాలకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. ఈ నెల 30 వరకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని అంచానా వేసింది.






