3 April, 2026 | 4:24 PM

టైటాన్స్‌కు ఢిల్లీ షాక్

13-12-2024 12:24 AM

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం పుణే వేదికగా దబంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 33 తేడాతో తెలుగు టైటాన్స్ ఓటమి చవిచూసింది. ఢిల్లీ రెయిడర్ నవీన్ కుమార్ (11 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరిశాడు.

టైటాన్స్ ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ 10 పాయింట్లు, ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ రెండో స్థానానికి దూసుకెళ్లగా తెలుగు టైటాన్స్ ఆరో స్థానానికి పడిపోయింది. యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలోగా ఇరుజట్లు 31 నిలిచాయి.