సంతోష్ ట్రోఫీ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ : ఈనెల 14 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. 57 సంవత్సరాల తర్వాత చారిత్రాత్మకమైన ఫుట్ బాల్ క్రీడా ప్రతిష్టాత్మక టోర్నీ సంతోష్ ట్రోఫీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమైన విష యం అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల డిసెంబర్ 31 వరకు దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి 37 జట్లు టోర్నీలో పాల్గొనున్నాయి.
గ్రూప్ సర్వీసెస్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్.. గ్రూప్ గోవా, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఒడిశా, మేఘాలయా ఉన్నాయి. ఈనెల 14 నుంచి 24 వరకు లీగ్ మ్యాచ్‌లు, డిసెంబర్ 26, 27 తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్, డిసెంబర్ 29న సెమీస్, 31న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కార్యక్రమంలో పార్లమెం టు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, రాష్ర్ట ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.




