4 July, 2026 | 5:23 PM

సెమీస్ ఆశలు సజీవం

13-12-2024 12:20 AM

హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో గాయత్రిత్రిసా జాలీ జంట బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూప్ మహిళల డబుల్స్ రెండో మ్యాచ్‌లో గాయ త్రి జోడీ 21 21 మలేషియాకు చెందిన పియర్లీ టాన్ మురళీథరన్ జంటపై సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విజయం తో గ్రూప్ పట్టికలో రెండో స్థానంలో నిలిచిన ఈ జోడీ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నేడు జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన మత్సయుయా షిడా జంటతో తలపడనుంది.