22 June, 2026 | 2:21 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

హిందువులపై ఉద్దేశపూర్వకంగా దాడులు

26-02-2026 12:29 AM

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి డిజిపి శ్రీవర్‌రెడ్డిని కలిసిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

నిజామాబాద్ ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): హిందువులపై కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారీ ఆరోపించారు.  జిల్లాలోని రుద్రూర్ బాన్సువాడ  నిజామాబాద్‌లో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్‌రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు.

బాధితులు స్థానిక పోలీసు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీని వారు ప్రాథమికంగా కూడా స్పందించడం లేదని పక్షపాత ధోరణితో బాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తున్నారరని డి జి పి కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో దాడులు జరగకుండా ఉండాలంటే స్థానిక పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, ఇకనైనా నిందితులను అరెస్టు చేసి వారిపై పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు జరుగుతున్న సున్నితమైన ప్రాంతాల్లో తక్షణమే పోలీసు బలగాలని మోహరించి భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందువులకు భద్రత కల్పించాలన్నారు.