19 April, 2026 | 2:13 AM

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌తో నష్టమే

19-04-2026 12:34 AM

బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌కు రాజ్యాంగం తెలియదన్నారు.

పార్లమెంట్ అమలు చేసిన చట్టాలను రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు తప్పకుండా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అమలు చేయకపోతే రాష్ట్రపతి పాలన అవకాశం ఉంటుందన్నారు. అన్ని తెలిసి సీఎం రేవంత్ నాటకాలాడుతున్నారని విమర్శించారు. మహిళలకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగడతామ న్నారు.

ఏడోసారి కాంగ్రెస్ మహిళా బిల్లును అడ్డుకుందని, దక్షిణాది రాష్ట్రాలు సీట్లు పెంచుకునే మంచి అవకాశన్ని కోల్పోయాయని చెప్పారు. 50 శాతం సీట్లపెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చేవని, 2011 లేదా 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.