19 April, 2026 | 2:14 AM

పార్లమెంట్‌లో మహిళల గొంతు నొక్కారు!

19-04-2026 12:32 AM
  1. నిరసన తెలపకుండా ఇక్కడ మా గొంతు నొక్కుతున్నారు
  2. అప్పుడు బిల్లుకు మద్దతిచ్చి..ఇప్పుడు అడ్డుకున్న కాంగ్రెస్
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  4. తార్నాకలో ఆయన హౌస్ అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని పార్లమెంట్‌లో మహిళల గొంతు నొక్కారని, నిరసన తెలపకుండా ఇక్కడ తమ గొంతు నొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.

బీజేపీ మహిళా మోర్చా నాయకులు జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి నుంచి సీఎం నివాసం వద్దకు చేరుకున్న సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తాము సీఎం రేవంత్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరితే, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని, తమ నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని మండి పడ్డారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ను అడ్డుకుంటు న్నారు.. మరోవైపు తమ నిరసనలనూ అడ్డుకుంటున్నారని, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన అని విమర్శించారు.

తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కనిపిస్తు న్నాయని, కాంగ్రెస్ పార్టీ చీకటి రోజులను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో ప్రదర్శిం చిన తీరు పూర్తిగా బానిస మనస్తత్వానికి నిదర్శనమన్నారు. విదేశీయుడైన ఏఓ హ్యూమ్స్ స్థాపించిన పార్టీగా ప్రారంభమైన కాంగ్రెస్.. ఈరోజు ఒక కుటుంబానికి మాత్రమే కట్టుబడి, అదే కుటుంబానికి బానిసలా పనిచేస్తున్న నాయకత్వాన్ని మనం చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, కుటుంబాధిపత్యం మాత్రమే ఉందన్నారు.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వంటి ఒకే కుటుంబానికి చెందినవాళ్లే రాజకీయాల్లో ఉండాలి.. సాధారణ మహిళలు ఎదగకూడదనే ఫ్యూడల్ మనస్తత్వం కాంగ్రెస్‌లో స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

మహిళా సాధికారతపై మాటల్లో మద్దతు, కానీ ఆచరణలో వ్యతిరేకత.. ఇదే కాంగ్రెస్ అసలు స్వభావమని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వస్తే సామాన్య మహిళలకు అవకాశాలు పెరుగుతాయని, ఇది కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అందుకే ఈ బిల్లును అడ్డుకున్నారన్నారు. నిన్న జరిగిన ఓటమి కేవలం ఒక బిల్లుదే కాదు అది దేశంలోని మహిళల ఆశల ఓటమి అన్నారు. దక్షిణాది అనే వాదనలు, హైబ్రిడ్ ఫార్ములా వంటి అంశాలు అన్నీ కూడా అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు తీసుకొచ్చినవేనని, అసలు విషయం ఒక్కటే..

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకోవడమన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వ డంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో అడ్డంకులు సృష్టిస్తోందని, గత 30 ఏళ్లుగా ఈ బిల్లు ను వాయిదా వేస్తూ వచ్చిందని, ఇప్పుడు మళ్లీ అదే పనిచేసిందన్నారు. నిజంగా మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాకుంటే, ఎందుకు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు? అని ప్ర శ్నించారు. మహిళల హక్కులను అడ్డుకున్న కాంగ్రెస్‌ను ఎప్పటికీ క్షమించరాదని, తెలంగాణ మహిళలు ఈ ద్రోహాన్ని గుర్తుంచుకో వాలని కోరారు.