అంబులెన్స్‌లో ప్రసవం తల్లీబిడ్డ క్షేమం
13-11-2025 12:00 AM
బూర్గంపాడు,నవంబర్ 12,(విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్ లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రస వించింది. ఈ సంఘటన బుధవారం బూ ర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బూర్గంపాడు మండలం చింతకుంట గ్రామానికి చెందిన మడివి రాజి నెలలు నిండటంతో బుధవారం మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గంమధ్యంలో అంబులెన్స్ సి బ్బంది పురుడు పోశారు. 108 ఇబ్బంది పర్యవేక్షణలో రాజి మగ బిడ్డకు జన్మనిచ్చిం ది.అనంతరం మొరంపల్లి బంజర పీహెచ్సీ కి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు. సకాలంలో స్పందించి కా న్పు చేసిన మెడికల్ టెక్నీషియన్ సుభద్ర, పై లెట్ విజయభాస్కర్ ను చింతకుంట గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.




