13-11-2025 12:00:00 AM
జహీరాబాద్, నవంబర్ 12 : గుర్తు తెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడి లారీతో సహా రూ.20 లక్షల పాన్ మసాలా ప్యాకెట్లను ఎత్తకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ - బీదర్ రోడ్డులో గల గంగువార్ వద్ద సోమవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీదర్ నుండి పాన్ మసాలా లోడ్‌తో వస్తున్న లారీ ని గంగువార్ వద్ద లారీని వెంబడించిన దుండగులు అడ్డగించారు. లారీని నిర్మాను ష్య ప్రదేశానికి తీసుకెళ్లి లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని నిర్బంధించి సరుకు వేరే వాహనంలోకి మార్చారు. లారీ డ్రైవర్ వద్ద ఉన్న 40 వేల నగదును కూడా దోచుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.