ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
19-06-2026 12:00 AM
వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం బెదిరింపు
గద్వాల, జూన్ 18: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న వాటర్ ట్యా్ంప ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్తో ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం కలకలం రేపింది.
తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబ్పు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న గద్వాల సీఐ టి. శ్రీను సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడితో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదుపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు వాటర్ ట్యా్ంప నుంచి కిందకు దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.






