19 June, 2026 | 1:54 AM

తారు మారు!

19-06-2026 12:24 AM

మట్టి రోడ్డుగా మారిన తారు రోడ్లు 

కేసముద్రం, జూన్ 18 (విజయక్రాంతి): ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా కేసముద్రం మండలంలోని పలు రోడ్ల పరిస్థితి మారింది. కేసముద్రం,  నెల్లికుదురు మండలాల పరిధిలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీ ల్ హైవే నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల నుంచి మట్టి, ఇతర మెటీరియల్ ను గ్రామీ ణ ప్రాంత రోడ్లపై భారీ వాహనాలతో తరలిస్తున్నారు.

దీనితో కేసముద్రం, నెల్లికుదురు మండలాల పరిధిలోని పలు గ్రామాలను కలిపే పంచాయతీరాజ్, ప్రధానమంత్రి గ్రా మీణ సడక్ యోజన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పంచాయతీరాజ్, ప్ర ధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం లో వివిధ తండాలకు, మారుమూల ప్రాం తాలను కలుపుతూ వేసిన తారు రోడ్లన్నీ ప్రస్తుతం అధ్వానంగా మారి, వాటి రూపురేఖలు పూర్తిగా తారు మారాయ్యాయి.

కేస ముద్రం మండలం కల్వల గ్రామం నుండి క్యాంపు తండా, నారాయణపురం, చిన్న ముప్పారం, రాజుల కొత్తపల్లి, తారా సింగ్ తండా, అలాగే ఇనుగుర్తి మండలం నుంచి చిన్న ముప్పారం, కోమటిపల్లి, కోమటిపల్లి క్రాస్ రోడ్, తౌరియా తండా, కోరుకొండ పల్లి, కేసముద్రం విలేజ్ నుండి కోమటిపల్లి, బుక్యారం తండా, మాన్సింగ్ తండా, సప్పిడి గుట్ట తండా, తారా సింగ్ తండా తదితర ప్రాంతాలకు చాలా కాలంగా అణువుగా ఉన్న రహదారులన్నీ ఇప్పుడు పూర్తిగా అధ్వానంగా మారిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి.

కోట్ల రూపాయలు వెచ్చించి మారుమూల ప్రాంతాల నుంచి మండల కేంద్రాలు, ఇతర గ్రామాలకు మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి తేగా, ఇప్పుడు గ్రీన్ఫీల్ హైవే కారణంగా ఆ రోడ్లన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద రోడ్డు పేరుతో చిన్న రోడ్లను పూర్తిగా నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలకు అనుమతి లేని రోడ్లపై పెద్ద పెద్ద డంపర్లు వినియోగిస్తూ మట్టి, ఇతర మెటీరియల్ తరలించడం వల్ల ఆయా రోడ్లన్నీ గతుకులమయమై, ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు కూడా సక్రమంగా వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

పెద్ద పెద్ద డంపర్లను అధిక లోడుతో నడపడం వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినగా, దెబ్బతిన్న చోట మట్టి పోయడం వల్ల తారు రోడ్ల రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయి, ఆయా రోడ్లు ఇప్పుడు మట్టి రోడ్లుగా కనిపిస్తున్నాయి. వర్షాకాలం వస్తే మట్టి బురదగా మారి వాహనాల రాకపోకలతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీరాజ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఇంజనీరింగ్ అధికారుల స్పందించి దెబ్బతిన రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.