19 June, 2026 | 1:32 AM

ఖానాపూర్ ఎమ్మెల్యేపై ఫేక్ ప్రచారం..? నమ్మవద్దని కాంగ్రెస్ నాయకుల వివరణ

19-06-2026 12:00 AM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమా బొజ్జు పటేల్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ ప్రచారం చేస్తూ నియోజకవర్గం లో గలిబిలి సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు దానిని నమ్మొద్దని ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే ఒకప్పుడు ఇందిరమ్మ ఇంట్లో ఉన్నాడని ప్రస్తుతం అధికారంలో ఉండి బిఎండబ్ల్యూ కార్లలో తిరుగుతున్నాడని పేర్కొంటూ అసత్య ప్రచారం నియోజకవర్గ వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ అవుతుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఆ ప్రచారాన్ని తిప్పి కొడుతూ నమ్మవద్దని గిట్టని వారు సృష్టించిన ప్రచారమే ఈ అబద్ధ ప్రచారమని వివరణ ఇస్తూ నియోజకవర్గంలోని ఒక కార్యక్రమానికి తన వాహనం రిపేర్ కావడంతో స్నేహితుని వాహనంలో ఆ కార్యక్రమానికి హాజరు కావడమే దీనికి కారణమని పేర్కొంటూ ప్రజలు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని గ్రూపులలో షేర్ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఈ వార్త చర్చనీ అంశమైంది.