calender_icon.png 15 October, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యబద్ధంగా డీసీసీ ఎన్నిక

15-10-2025 05:56:47 PM

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు పూర్వవైభవం..

కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పెద్దపల్లి జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి..

పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై తమిళనాడు మాజీ ఎంపీ డా. జయ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు..

పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రజాస్వామ్యబద్దంగా డీసీసీ ఎన్నిక ఉంటుందని పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు, తమిళనాడు మాజీ ఎంపీ డా. జయ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఏఐసీసీ పరిశీలకులు డా. జయ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్బంగా ఏఐసీసీ పరిశీలకులు, తమిళనాడు ఎంపీ డాక్టర్. జయ కుమార్ మాట్లాడుతూ... ఏఐసీసీ నిర్ణయం హర్షించదగ్గదని, రాబోయే భవిష్యత్తు కాలంలో సమస్తవంతమైన నాయకుని ఎన్నుకోగలుగుతామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కిందిస్థాయి నుంచి వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, పిసిసి కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నాయకత్వంతో అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గం లతో పాటు ధర్మపురి నియోజకవర్గం ధర్మారం గ్రామంలో కూడా అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వివరించారు. డిసిసి ఎన్నికకు ప్రతి కార్యకర్త స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని, అయితే అభిప్రాయ సేకరణ అనంతరం అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన వివరించారు. డిసిసి అధ్యక్షుని ఎంపిక దరఖాస్తు కోసం ఈ నెల 22 వరకు చేసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని, రాష్ట్రం కేంద్రానికి పంపిన బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తేల్చకపోవడం సరి కాదన్నారు. అమలు కానీ 42% బిసి రిజర్వేషన్ అసెంబ్లీ తీర్మానం చేసిందని చెబుతున్న బిజెపి నాయకులు కేంద్రంలో నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీని నిలదీయాలన్నారు.

అభిప్రాయ సేకరణతో పెద్దపల్లి జిల్లా డిసిసి ఏర్పాటు పారదర్శకంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీ డి.సి.సి ఎంపిక ప్రజాస్వామ్య బద్దంగా ఉంటుందని, రాహుల్ గాంధీ జాతీయ భారత్ జోడో యాత్రతో మార్పు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలని గ్రామీణ స్థాయి ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ నేషనల్ కో ఆర్డినేటర్ కేతూరి వెంకటేష్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజేష్, టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ బసిత్, పార్టీ జనరల్ సెక్రటరీ కాశీపాక రాజేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాన్నాయక దామోదర్ రావు, ఆరే సంతోష్, మార్కెట్ చైర్మన్లు మినుపాల ప్రకాష్ రావు, ఈర్ల స్వరూప, గండు సంజీవ్,  మండల పార్టీ అధ్యక్షులు కాడర్ల శ్రీనివాస్, చిలుక సతీష్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, బొజ్జ శ్రీనివాస్, సదయ్య, పట్టణ అధ్యక్షలు భూషణవేణి సురేష్ గౌడ్, వేగోలపు అబ్బయ్య గౌడ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు  యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్, అసెంబ్లీ అధ్యక్షులు ముత్యాల నరేష్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.