15-10-2025 05:52:07 PM
ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వడ్డెర కాలనికి చెందిన సూర రత్నవ్వ భర్త ఎల్లయ్య మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చిన్న కూతురు వివాహానికి అవసరమైన ఖర్చులను భరించలేకపోతున్న రత్నవ్వ పరిస్థితిని గమనించిన బిఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. ఆయన స్వయంగా కుటుంబాన్ని సందర్శించి, పెళ్లి కూతురికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రత్నవ్వ కుటుంబ సభ్యులు రామ్మోహన్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన సహాయానికి సంతోషం వ్యక్తం చేశారు.