15 May, 2026 | 3:31 PM

చెరువుల పరిరక్షణకు అక్రమ కట్టడాల కూల్చివేతలు తప్పదు

26-08-2024 02:19 PM

హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రి పొన్నం తెలిపారు. ఆక్రమణలకు గురైన చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలుతీసుకుంటుందన్నారు. వాతావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. చెరువులపై ప్రభుత్వ లెక్కలు, రికార్డుల మేరకు కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులను పరిరక్షించుకోవాలన్నారు. చెరువుల రక్షణపై ప్రభుత్వం దృష్టికి స్థానికులే తేవాలని మంత్రి కోరారు. ప్రభుత్వం ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని పొన్నం తెలిపారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.. ప్రభుత్వ పనిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హర్శిస్తున్నారని మంత్రి పొన్నం వెల్లడించారు.