13 May, 2026 | 2:13 AM

బాలాపూర్‌లో అక్రమ వెంచర్ కూల్చివేతలు

13-05-2026 12:47 AM

బడంగ్ పేట్  (విజయక్రాంతి) మే 12: జిహెచ్‌ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ పరిధి బాలాపూర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన అక్రమ వెంచర్ ను మంగళవారం అధికారులు కూల్చివేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసిపి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. జిహెచ్‌ఎంసి శంషాబాద్ జోన్ బడంగ్ పేట్ సర్కిల్ పరిధి బాలాపూర్ సర్వే నెంబర్ 9, 10, 11 లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ ను జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు, సర్కిల్ డీసీ సమ్మయ్య ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు. రోడ్లు, భూగర్భ ట్యాంకులు, విద్యుత్తు స్తంభాలను ధ్వంసం చేయడంతో పాటు రోడ్లను కూడా ధ్వంసం చేసినట్లు చెప్పారు.

గతంలో ఈ వెంచర్ కు నోటీసులు ఇచ్చిన, వెంచర్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. నోటీసుల గడువు ముగిసిన తరువాత కూల్చివేతలు చేపట్టినట్లు పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా అక్రమ వెంచర్లు వేసినచో, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసి నష్టపోకూడదని సూచించారు. కూల్చివేతలు అనంతరం తిరిగి వెంచర్ చేపడితే, తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏసిపి కిరణ్ కుమార్ హెచ్చరించారు. కూల్చివేతలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.