13 May, 2026 | 2:14 AM

మదర్ డైరీకి పూర్వ వైభవం తెచ్చిన ఘనత బీర్ల ఐలయ్యదే..

13-05-2026 12:49 AM

ఉప సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు దుంబాల  వెంకట్ రెడ్డి

యాదగిరిగుట్ట, మే 12: గత పాలకుల నిర్లక్ష్యంతో మదర్ డైరీ కష్టాల్లో కూరుక పోయిందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐల్లయ్య చొరువతో మదర్ డైరీ కి పూర్వ వైభవం వచ్చిందని ఉపసర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దుంబాల వెంకటరెడ్డి అన్నారు.

మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నల్గొండ, రంగారెడ్డి మదర్ డైరీ ని ఆదుకొని చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పాడి రైతుల పాల బిల్లులకు గాను ఎన్ డి డి బీ ధ్వారా 10 కోట్లు మంజూరు చేసిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు పాడి రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. 

 గత పాలనలో అప్పుల్లో కోరుకుపోయి బిల్లులు రాక కష్టాల్లో ఉన్న  మదర్ డైరీ ని గాడిన పెట్టటంలో ప్రభుత్వ విప్  బీర్ల ఐలయ్య కృషి ఎంతో ఉందని అన్నారు. పాడి రైతులను ఆదుకో వడానికి అహర్నిశలు కృషి చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి కి  ఆలేరు నియోజకవర్గ పాడి రైతుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.