13 May, 2026 | 2:13 AM

నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

13-05-2026 12:47 AM

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ 

మిర్యాలగూడ మే 12 : డాక్టర్ కావాలనే ఆశతో మే 3న లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాశారని ఇప్పుడు ఆ పేపర్ లీక్ వల్ల పరీక్షలు రద్దు చేస్తున్నామని జాతీయ పరీక్ష సంస్థ ప్రకటించడంతో లక్షలాది మంది విద్యార్థుల బాధ వర్ణనాతీతం అని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ అన్నారు.రాజస్థాన్ లో జరిగిన పేపర్ లీకేజీ నిర్హహకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ అమరవీరుల స్తూపం వద్ద ఫ్లకార్డులతో ప్రదర్శన మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ అత్యంత కట్టుదిట్టమైన పహారాలో ఉండాల్సిన పత్రాలు ఈ విధంగా సంతలో కూరగాయలు దొరికినట్లు పేపర్లు చేతులు మారడం చాలా బాధాకరమైన విషయం అన్నారు.ఎన్నో ఆశలతో వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టి హాస్టల్లో ఉంటూ కోచింగ్ లు తీసుకొని రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమ వృధా అయినట్టేనని అన్నారు.పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిబిఐ చేత ఎంక్వయిరీ చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు రాంబాబు,లవన్ కుమార్ వెంకటయ్య,సతీషు వెంకటేష్ నవీన్ సందీప్ ప్రదీప్ గౌతమ్ శిల్ప అశ్విని స్వాతి లావణ్య సునీత సరస్వతి కుమారి మౌనిక వెన్నెల తదితరులు పాల్గొన్నారు.