రోడ్డు ఆక్రమిత నిర్మాణాల కూల్చివేత
ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదు
రహదారి ఆక్రమణల తొలగింపు
ఇబ్రహీంపట్నం ఆగస్ట్ 19 (విజయక్రాంతి): ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని మంగళ్ పల్లిలో రహదారిని ఆక్రమించి నిర్మాణం చేసిన నిర్మాణాలు, ఇతర ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ అధికారి రఘునాథ్ తొలగించారు. రహదారి ఆక్రమించిన కారణంగా తరచూగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
ఆక్రమణల తొలగింపు సందర్భంగా కొంతమంది స్థానికుల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా కూల్చివేతలను కొనసాగించారు. రహదారులపై ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయగా. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులను ఆక్రమించిన నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
రహదారులు, ఫుట్పాత్లు ప్రజల వినియోగానికే ఉండలనీ ఆక్రమణలపై నిరంతరం చర్యలు చేపడతామని తెలిపారు.దారి పక్కనే ఉన్న ఆక్రమణలు తొలగింపులో, షాపుల యజమానులు వ్యతిరేకీoచిన . రోడ్డుపై పూర్తిగా అన్ని షాపుల ముందున్న అక్రమణలను తొలగించాలని, కేవలం కొందరి షాపుల ముందు మాత్రమే తొలగిస్తున్నారని, రోడ్డుకు ఇరువైపుల షాపుల ముందు ఉన్న ఆక్రమణలు కూడా తప్పనిసరిగా తొలగించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి రఘునాథ్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






