ఫొటోగ్రాఫర్లు చరిత్రను, జ్ఞాపకాలను భద్రపరిచే కళాకారులు
కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు, ఆగస్టు 19 : ఒక ఫోటో అనేది కేవలం ఒక చిత్రం కాదని, అది ఒక కాలానికి, ఒక సంఘటనకు, ఒక జ్ఞాపకానికి శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ ఫోటో మన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బాధ్యతను ఫోటోగ్రాఫర్లు నిర్వర్తిస్తున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యాలయంలో వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమం, ప్రజా ఉద్యమం, సామాజిక పరిణామం, కుటుంబ వేడుకలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని నీలం మధు అన్నారు. ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నాటి జ్ఞాపకాలను కళ్లముందు నిలిపేది ఫోటోగ్రఫీ అని పేర్కొన్నారు. అందుకే ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకుని సేవలందిస్తున్న వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని గతంలో తాను చేయించిన హెల్త్ ఇన్సూరెన్సు కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాజేశ్వర్, ఇస్నాపూర్ ప్రెసిడెంట్ నరేందర్, శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సందీప్, కౌన్సిలర్స్ సంఘన్నగారి గోపాల్, దస్తగిరి,లక్ష్మా రెడ్డి, మురళి, కృష్ణ యాదవ్,శంకర్, పవన్,రవి, రాజేష్, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






