calender_icon.png 9 September, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమలతోనే డెంగ్యూ వ్యాప్తి

09-09-2025 12:05:58 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 8 : ఇంటి ఎదుట, వీధుల్లో నీకీ నిల్వలతోనే డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఆర్కేపురం డివిజన్ టెలిఫోన్ కాలనీలో ఒక బాలుడికి డెంగ్యూ సోకిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. బాలుడిని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ బాధితుడి ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దోమల నివారణతోనే డెంగ్యూ వైరస్ వ్యాప్తిని అరికట్ట వచ్చాన్నారు. దోమలతో వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని, నీటి నిల్వలను తొలిగించి దోమల వృద్ధిని అరికట్టి, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి సంరక్షించుకోవాలని సూచించారు.

ముఖ్యంగా వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించి, దోమ గుడ్లు పెట్టే ప్రదేశాలను గుర్తించి, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలిగించాలని కోరారు. దోమలతో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా తదితర వ్యాధులు ప్రబలే అవకాశం  ఉందన్నారు. అనంతరం టెలిఫోన్ కాలనీలో ఉన్న నీటి నిల్వల్లో యాంటీ లార్వాలు వదిలారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సూపర్ వైజర్ శ్యాంసుందర్, డీఎంవో సిబ్బంది పాల్గొన్నారు.