09-09-2025 12:05:29 AM
వెల్దండ సెప్టెంబర్ 8 : స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్కరు సహకరించాలని ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి అన్నారు. సోమవారం వెల్దండ మండల పరిషత్ కార్యాల యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల మాజీ ప్రజాప్రతి, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ఓటర్ జాబితాలోని పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో అభ్యంతరాలు ఉంటే తెలియ చేయా లన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన పార్టీల నాయకులు సిద్ధంగా ఉండాలని కో రారు. సమావేశంలో పార్టీల నాయకులు మోతిలాల్, యాదగిరి,వెంకట్ గౌడ్, శ్రీనివా స్ యాదవ్, కార్యదర్శి గిరి,ఫయాజ్ హారిక మల్లేష్ వినోద్ తదితరులుపాల్గొన్నారు.