09-09-2025 12:11:24 PM
ప్రభుత్వ పథకాలు గురించి అవగాహన కల్పించని నాయకులు
సొంత పనుల్లో నిమగ్నమైన వైనం
మండల ప్రజల్లో జోరుగా చర్చ
గుమ్మడిదల, (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో గుమ్మడిదల మండల కాంగ్రెస్ నాయకులు(Congress leaders ), కార్యకర్తలు విఫలమవుతున్నారని మండల ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.ఈ విషయంపై వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వాలు చేయని పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు రేషన్ కార్డు, ఉచిత బస్సు ప్రయాణం పథకం,వంట గ్యాస్ సిలిండర్ పథకం, 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకం, రైతుబంధు, అమలు చేస్తున్నారు.
అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లు,బీసీ గణన,సన్న బియ్యం,మరెన్నో సంక్షేమ పథకాలు మండలంలోని కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారన్నారు.కేవలం రాజకీయంగా స్వలాభాల కోసమే అధికార పార్టీ నాయకులం అంటూ చెలామని అవుతున్నారన్నారు.పథకాల గురించి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించట్లేదని చర్చించుకుంటున్నారు.అంతేకాకుండా వారి సొంత పనుల్లో నిమగ్నమైనట్లు తెలిపారు.ఇప్పటికైనా నేటి నుండే మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కార్యచరణతో అన్ని గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.