1 August, 2026 | 8:56 AM

బయలుదేరిన భారత్ గౌరవ్ రైలు

23-06-2024 12:34 AM

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర (భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్ర) రైలును శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 592 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు వంటి పుణ్యక్షేత్రాల దర్శనం అనంతరం 9 రోజుల తర్వాత తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.