10 June, 2026 | 1:16 AM

‘మీనాక్షి’ నామినేషన్ తిరస్కరణ

10-06-2026 12:00 AM

భోపాల్, జూన్ 9: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో ఉన్న కేసులను ఉద్దేశ్యపూర్వకంగానే దాటిపెట్టారన్న బీజేపీ ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి మంగళవారం నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ అర్పిత శర్మ నిర్ణయం తెలిపారు. గతేడాది మీనాక్షిపై హైదరాబాద్‌లో నమోదైన కేసులు తెలియజేయాలని కోరుతూ, రిటర్నింగ్ అధికారి ఆమెకు షో-కాజ్ ఇచ్చినా దాఖలు చేయకపోవడంతోనే నామినేషన్ తిరస్కరణకు గురైందని అధికార వర్గాలు వెల్లడించాయి.