15 April, 2026 | 9:34 AM

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత

15-06-2025 04:09 PM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

వీఎం హోమ్ లో విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు

ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పుట్టినరోజు వేడుకలను ఆదివారం కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించారు. విద్యార్థుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఆయనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. పిల్లలతో కేక్ కట్ చేసి, వారితో హృదయపూర్వకంగా మమేకమయ్యారు.

విద్యారంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వేడుకల్లో టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలతో కేక్ కట్ చేసి, వారితో హృదయపూర్వకంగా మమేకమయ్యారు మల్లు భట్టి విక్రమార్క. విద్యారంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.