19 August, 2026 | 4:32 AM

పూడూర్‌కిష్టాపూర్ వార్డులో డిప్యూటీ కమిషనర్

19-08-2026 01:30 AM

సుధాంష్ పర్యటన

మేడ్చల్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): మేడ్చల్ సర్కిల్ పరిధి పూడూర్‌కిష్టాపూర్ వార్డు పరిధిలోని టీచర్స్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, బ్రాడ్వే కాలనీ, హైటెక్ స్కూల్ రోడ్, అత్యేల్లి గ్రామం శాంతా బయోటెక్ రోడ్ ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్ సుధాంష్ పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు  సూచనలను తెలుసుకున్నారు.

ఈ క్షేత్రస్థాయి పర్యటన ద్వారా స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, తక్షణ శ్రద్ధ అవసరమైన ప్రాధాన్యతా అంశాలను గుర్తించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలు మరియు అవసరాలను నమోదు చేసి, వాటిపై వీలైనంత త్వరగా తదుపరి చర్యలు తీసుకునేలా సంబంధిత అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పూడూరు కిష్టాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు వేముల శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.