19 August, 2026 | 3:39 AM

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

19-08-2026 01:28 AM

రెడ్డిపల్లి గ్రామంలో ఘటన.. పోలీసుల దర్యాప్తు

మృతురాలి కుటుంబ సభ్యుల అనుమానంతో కేసు నమోదు

మొయినాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): రెడ్డిపల్లి గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నమంగళారం గ్రామానికి చెందిన వల్లూరి మల్లమ్మ (45) ఆగస్టు 15న కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీస్తుండగా, రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మాణిక్యం మల్లమ్మ మృతదేహం గ్రామంలోని పాఠశాల వెనుక ఖాళీ ప్రదేశంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలి పరిస్థితిపై కుటుంబ సభ్యులకు అనుమానం ఉండటంతో మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.