గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉపసర్పంచ్ సత్యగౌడ్
21-07-2026 12:22 AM
చేగుంట జూలై 20: చేగుంట మండలం పోలంపల్లి గ్రామ సర్పంచ్ గా, ‘ఉపసర్పంచ్ ‘ సత్య గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కొండి రాజ్యలక్ష్మి (సర్పంచ్ )ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సస్పెండ్ చేసిన విష యం పాఠకులకు తెలిసిందే ,జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం పంచాయతీ సెక్రటరీ వెంకటేశం ఆధ్వర్యంలో సత్య గౌడ్ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించారు,ఈ సం దర్బంగా తాను మాట్లాడుతూ గ్రామ పరిరక్షణ కోసం, నిరంతరం పాటుపడుతానని గ్రామాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటనని సర్పంచ్ సత్య గౌడ్ తెలిపారు.






