ఎం ఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీని వెంటనే తొలగించాలి
- హియరింగ్ గ్రామాల్లోనే నిర్వహించాలని డిమాండ్
- అగర్వాల్ కంపెనీపై గ్రామస్థుల గళమెత్తిన ఆందోళన
- కంపెనీ కాదు.. ప్రజల ప్రాణాలు ముఖ్యం
- కలెక్టర్ గేటు వద్ద రెండు గ్రామాల ప్రజలు బైఠాయింపు.
మెదక్, జులై 20 (విజయ క్రాంతి) : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామాల కు చెందిన సుమారు 400 మంది గ్రామస్థులు సోమవారం మెదక్ కలెక్టరేట్ను ముట్ట డించారు. ఎం ఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీ విస్తరణను వెంటనే నిలి పివేసి, కంపెనీని గ్రామాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ నియోజ కవర్గ బీఆర్‌ఎస్ ఇన్చార్జి వంటేరు.
ప్రతాప్రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించేందుకు తరలివచ్చారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్థులు అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహిం చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు. వా రం రోజుల్లో జిల్లా కలెక్టర్ స్వయంగా రెండు గ్రామాలకు వచ్చి ప్రజల సమక్షంలో బహిరంగ హియరింగ్ నిర్వహించి, ప్రజాభిప్రా యం మేరకు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే వచ్చే సోమవారం వేలాది మందితో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ..గత 20 ఏళ్లుగా కంపెనీ నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, శబ్ద కాలుష్యంతో రెండు గ్రామాల ప్రజల జీవనం నర కప్రాయంగా మారిందని ఆరోపించారు. నెల కు లక్ష క్వింటాళ్ల స్టీల్ ఉత్పత్తి కారణంగా కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందన్నారు. వర్షం పడితే నల్లటి నీరు కురుస్తోందని, చెరువులు, బోర్లు కలుషితమై తాగునీటికి పనికిరావడం లేదని, ప్రస్తుతం మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు.
ఆరేసిన బట్ట లు సాయంత్రానికి నల్లగా మారిపోతున్నాయని, మహిళలు చర్మవ్యాధులు, పిల్లలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, పంటలు దెబ్బతిని ప్రజలు సంపాదించిన డ బ్బంతా ఆస్పత్రులకే ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీని వెంటనే తొలగించాలని, అది సాధ్యం కాకపోతే రెం డు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల మధ్య జరగాల్సిన హియరింగ్ను పోలీసుల మధ్య నిర్వహించడం ప్రజాస్వా మ్యానికి విరుద్ధమని విమర్శించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాలకు వచ్చి పారదర్శకంగా హియరింగ్ నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే నిరవధిక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
’కాలుష్యంతో బతకలేకపోతున్నాం’
గ్రామస్థులు మాట్లాడుతూ.. ‘ఎం ఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ వల్ల చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామాల ప్రజల జీవితం నరకప్రాయంగా మారింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కంపెనీ నుంచి వెలువడే నల్లటి పొగతో ఇళ్లు, బట్టలు, చెట్లు దుమ్ముతో కప్పుకుపోతుండగా.. వర్షపు నీటితో చెరువులు, బోర్లు కలుషితమై తాగునీరు, వ్యవసాయ భూములు దెబ్బతింటు న్నాయి.
ప్రజల ఆరోగ్యం కంటే కంపెనీ ప్రయోజనాలకే అధికారులు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ స్వయంగా రెండు గ్రామాలకు వచ్చి ప్రతి కుటుంబం అభిప్రాయాన్ని తెలుసుకుని ప్రజల నిర్ణయానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కంపెనీని వెంటనే తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం‘ అని హెచ్చరించారు.






