calender_icon.png 8 August, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

21-09-2024 12:20:36 AM

కరీంనగర్, సెప్టెంబరు 20 (విజయక్రాంతి): విద్యార్థునులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవీధిలో గల నారాయణ స్కూల్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు చెప్పారు. శుక్రవారం తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం యాజమాన్యానికి అప్పగించగా శ్రీనివాస్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సదరు ఉపాధ్యా యుడిని చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.