16 April, 2026 | 12:27 PM

అనారోగ్యంతో దేశ్ పాండే ఆంజనేయులు మృతి

05-11-2025 06:55 PM

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో అనారోగ్యంతో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు ఆంజనేయులు మరణించారు. దేశ్ పాండే ఆంజనేయులు(43) గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. గతంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా ఆంజనేయులు సోదరుడు శంకర్ గత కొన్నేళ్ల క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. సోదరులు ఇద్దరు అర్ధాంతరంగా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పండుగ పూట ఎల్లారెడ్డిపేటలో విషాదం నెలకొంది.