02-05-2025 11:04:13 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు, యువకులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడల వల్ల దేహదారుఢ్యం పెంపొందడమే కాకుండా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్య అభివృద్ధి పెంపొందుతాయని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం ఎస్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం క్రీడా పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ మార్కెట్ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి, సొసైటీ చైర్మన్ కాకినాడ హరి ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, విజయపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, పెద్దగాని సోమయ్య, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ నిర్వాహకులు మసూద్, షాబీర్, హైమద్, వధూర్ తదితరులు పాల్గొన్నారు.