03-05-2025 11:41:10 AM
తప్పు జరిగిందని చెబితే చాలు.. బాధ్యులపై చర్యలు
హైదరాబాద్: టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం.. దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పండి.. నిజమైన పేదలకే ఇళ్లు(Indiramma Housing Scheme) కేటాయించాలి, దీనిలో మరో మాట లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas reddy) అన్నారు. తప్పు జరిగిందని చెబితే చాలు బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాక్ లో శిక్షణ పూర్తిచేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల(Assistant Engineers)కు మంత్రి పొంగులేటి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివాదాలు ఉన్న కొన్ని ఇళ్లను విత్ హోల్డ్ లో ఉంచామని చెప్పారు. ప్రతి ఇంటిని ట్రాక్ చేసేలా ఏఐను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను పూర్తిగా వాడుతున్నామని వెల్లడించారు. ఇంజినీర్లు ఫేజ్-1 నుంచి ఫేజ్-4 వరకు జాగ్రత్తగా సిఫారసు చేయాలని కోరారు. అర్హులను ఎంపిక చేసేటప్పుడు అధికారులు అన్ని విషయాలూ పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలని మంత్రి పొంగులేటి ఇంజినీర్లను కోరారు.