రెండో రోజు ఏసీబీ విచారణకు హరిరామ్
హైదరాబాద్: నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిరామ్(Irrigation Department ENC Hariram)ను ఏసీబీ అధికారులు శనివారం రెండో రోజు ప్రశ్నించనున్నారు. నిన్న మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు హరిరామ్ సరిగా స్పందించలేదని అధికారులు వెల్లడించారు. ఏసీబీ(Anti-Corruption Bureau) కోర్టు హరిరామ్ ను ఐదురోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శ హరిరామ్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసు నమోదైన తర్వాత అవినీతి నిరోధక శాఖ ఇరిగేషన్, సీఏడీ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్య హరి రామ్‌ను అరెస్టు చేసిన ముచ్చట తెలిసిందే.
హరి రామ్, అతని బంధువుల ఇల్లు సహా 14 ప్రదేశాలలో ఏసీబీ(ACB) బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో, షేక్‌పేటలోని విల్లా, కొండాపూర్‌లోని విల్లా, మాదాపూర్‌లోని శ్రీనగర్ కాలనీ, నర్సింగిలోని ఫ్లాట్‌లు, అమరావతిలోని వాణిజ్య స్థలం, మర్కూక్ మండలంలోని 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరువులోని 20 గుంటలు, శ్రీనగర్ కాలనీలో రెండు ఇళ్లు, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో ఒక ఫామ్‌హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, మిర్యాలగూడలోని కుత్బుల్లాపూర్‌లోని ఓపెన్ ప్లాట్, బీఎండబ్ల్యూ, బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్‌లకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.






