8 July, 2026 | 12:54 AM

అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందించాలి

08-07-2026 12:14 AM
  1. జిల్లా అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి,
  2. దిశ కమిటీ చైర్మన్, ఎంపీ పోరిక బలరామ్ నాయక్

మహబూబాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని దిశ కమిటీ చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు..మంగళవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో దిశ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్లు రెవెన్యూ కె.అనిల్ కుమార్, (ఇంచార్జ్) స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, దిశ కమిటీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు,

ఈ సందర్భంగా వ్యవసాయం, హౌసింగ్, వైద్య ఆరోగ్య, సంక్షేమం, స్టేట్, నేషనల్ హైవే, డీఆర్డిఏ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, సివిల్ సప్లై, ఎంపీ,  డి.ఎం.ఎఫ్.టి ల్యాండ్స్ మార్కెటింగ్, విద్యా శాఖ, పశు వైద్య, పశుసంవర్ధక, సెరికల్చర్, హార్టికల్చర్, ఉపాధి కల్పనా, పంచాయతీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసి, సంక్షేమ శాఖలు, మైన్స్ అండ్ జియోలజీ, కార్మిక, సర్వే ల్యాండ్ రికారడ్స్, పరిశ్రమలు, ప్రీ - మెట్రిక్/ పోస్ట్ మెట్రిక్, ఎం. సి. ఎం, ఉపకార వేతనాలు, యూత్,స్పోరట్స్, వాతావరణ, బిఎస్‌ఎన్‌ఎల్, మత్స్య శాఖ, రెడ్కో, పోస్టల్, బ్యాంక్స్, పురపాలక సంఘాలు (మున్సిపల్) మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, కేసముద్రం, రోడ్లు, భవనాలు రహదారి, గ్రంథాలయం, జిల్లా ప్రధాన హాస్పిటల్, కామన్ సర్వీస్ సెంటర్, తదితర 90 అంశాలపై సుదీర్ఘ సమయం సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాల అమలులో జాప్యం తగదన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా పారదర్శకంగా అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నారు.